Skip to content
1 దినవృత్తాంతములు 9:17-27

1 దినవృత్తాంతములు 9:17-27

17
ద్వారపాలకులు: షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను, వారి తోటి లేవీయులు. వీరిలో షల్లూము పెద్ద.
18
వారు తూర్పున ఉన్న రాజు ద్వారం దగ్గర ఇప్పటివరకు సేవ చేస్తున్నారు. వీరందరు లేవీయుల సమూహానికి చెందిన ద్వారపాలకులు.
19
కోరహు కుమారుడైన ఎబ్యాసాపుకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూము, తన కోరహీయుల వంశంలోని తన తోటి ద్వారపాలకులు, తమ పూర్వికులు యెహోవా శిబిరానికి కావలివారిగా ఉన్నట్లుగా, వారు ఆలయద్వారాన్ని కాపలా కాసేవారు.
20
పూర్వకాలంలో ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ద్వారపాలకుల మీద అధికారిగా ఉన్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నారు.
21
మెషెలెమ్యా కుమారుడైన జెకర్యా సమావేశ గుడారపు ద్వారానికి ద్వారపాలకుడు.
22
ద్వారాల దగ్గర ద్వారపాలకులుగా ఎన్నుకోబడినవారు 212 మంది. వారు తమ గ్రామాల్లో తమ వంశాల ప్రకారం నమోదు చేయబడ్డారు. వారు నమ్మకమైన వారని దావీదు, దీర్ఘదర్శియైన సమూయేలు వారిని ఆ స్థానాల్లో నియమించారు.
23
వారు వారి వారసులు సమావేశపు గుడారం అని పిలువబడే యెహోవా మందిరపు ద్వారాలకు కాపలా కాసే బాధ్యత కలిగి ఉన్నారు.
24
ద్వారపాలకులు నలువైపులా ఉన్నారు అనగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వైపు ఉన్నారు.
25
వారి గ్రామాల్లో ఉండే వారి తోటి లేవీయులు క్రమంగా వస్తూ ఏడు రోజులపాటు తమ విధులను పంచుకునేవారు.
26
అయితే లేవీయులైన నలుగురు ప్రధాన ద్వారపాలకులు నమ్మకమైనవారు కాబట్టి దేవుని మందిరపు గదులకు, ఖజానాకు సంబంధించిన బాధ్యత వారికి ఇవ్వబడింది.
27
వారు దేవుని ఆలయానికి కావలివారు కాబట్టి దాని దగ్గరే రాత్రంతా ఉండేవారు; ప్రతి ఉదయం దాని తలుపులు తెరిచే బాధ్యత వారిదే.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options