Skip to content
1 దినవృత్తాంతములు 28:19

1 దినవృత్తాంతములు 28:19

చుట్టుపక్కల సందర్భంతో వచనం 19 చూపబడుతోంది.
16
దేవుని సన్నిధిలో రొట్టెలుంచే ఒక్కొక్క బంగారు బల్లకు కావలసిన బంగారాన్ని; వెండి బల్లలకు కావలసిన వెండిని;
17
కొంకులు, గిన్నెలు, పాత్రలకు కావలసిన మేలిమి బంగారాన్ని; ఒక్కొక్క బంగారు పాత్రకు కావలసిన బరువు ప్రకారం బంగారాన్ని; ఒక్కొక్క వెండి పాత్రకు కావలసిన బరువు ప్రకారం వెండిని;
18
ధూపవేదికకు కావలసిన స్వచ్ఛమైన బంగారాన్ని దావీదు అతనికి ఇచ్చాడు. తమ రెక్కలు విప్పి యెహోవా నిబంధన మందసాన్ని కప్పివుంచే బంగారు కెరూబుల రథం యొక్క నమూనాను కూడా దావీదు అతనికిచ్చాడు.
19
అప్పుడు దావీదు, “ఇదంతా యెహోవా తన చేతిని నా మీద ఉంచడం వలన నేను వీటన్నిటిని వ్రాశాను, ఈ నమూనా వివరాలన్ని నేను గ్రహించగలిగేలా ఆయన చేశారు” అని చెప్పాడు.
20
దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఇంకా మాట్లాడుతూ ఇలా చెప్పాడు, “దృఢంగా, ధైర్యంగా ఉంటూ పని చేయి. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉంటారు కాబట్టి భయపడకు దిగులుపడకు. యెహోవా ఆలయ సేవకు సంబంధించిన పనులన్నీ ముగిసేవరకు ఆయన నిన్ను ఏమాత్రం విడిచిపెట్టరు.
21
దేవుని ఆలయ సేవ అంతటి కోసం యాజకులు, లేవీయుల విభాగాల ప్రకారం ఏర్పాటయ్యారు. ఈ పనులన్నీ చేయడానికి రకరకాల పనులలో నైపుణ్యం గలవారు మనస్పూర్తిగా నీకు సహాయం చేస్తారు. అధిపతులు, ప్రజలందరూ నీ ప్రతి ఆజ్ఞకు లోబడతారు.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options