Skip to content
1 దినవృత్తాంతములు 23:28-32

1 దినవృత్తాంతములు 23:28-32

28
యెహోవా ఆలయ సేవలలో అహరోను వారసులకు సహాయం చేయడమే వారికి అప్పగించబడిన బాధ్యత: ప్రాంగణాలు, ప్రక్క గదుల బాధ్యత, పవిత్ర వస్తువులన్నిటిని శుద్ధి చేయడం, దేవుని మందిరంలో ఇతర పనులు చేయడము.
29
బల్లమీద సన్నిధి రొట్టెలుంచడం, భోజనార్పణల కోసం ప్రత్యేక పిండిని చూడడం, పులియని అప్పడాలు చేయడం, కాల్చడం, కలపడం, అన్ని రకాల పరిమాణాలు కొలతల్లో సిద్ధపరచడము.
30
వారు ప్రతిరోజు ఉదయం, సాయంకాలం నిలబడి యెహోవాను స్తుతించాలి. వారు సాయంకాలంలో, సబ్బాతు దినాల్లో, అమావాస్యల్లో, నియమించబడిన పండుగల్లో, యెహోవాకు దహనబలులు అర్పించే సమయాలన్నిటిలో వారు ఆయనను స్తుతించాలి. వారికి నియమించబడిన విధానం ప్రకారం క్రమంగా యెహోవా సముఖంలో సేవ చేయాలి.
32
కాబట్టి లేవీయులు సమావేశపు గుడారానికి, పరిశుద్ధ స్థలానికి బాధ్యత వహిస్తూ, యెహోవా ఆలయ సేవ కోసం తమ బంధువులైన అహరోను వారసుల క్రింద వారు సేవ చేశారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options