Skip to content
1 దినవృత్తాంతములు 23:24-27

1 దినవృత్తాంతములు 23:24-27

24
వీరు కుటుంబాల ప్రకారం లేవీ వారసులు; పేర్ల నమోదు ప్రకారం కుటుంబ పెద్దలైన వీరు ఇరవై సంవత్సరాలు అంతకు పైవయస్సు కలిగి, తమ తమ పేర్లను బట్టి ఒక్కొక్కరుగా లెక్కించబడి యెహోవా మందిరంలో సేవ చేయడానికి నియమించబడ్డారు.
25
ఎందుకంటే దావీదు, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజలకు నెమ్మది ప్రసాదించి, శాశ్వతంగా యెరూషలేములో నివసించడానికి వచ్చారు కాబట్టి,
26
ఇకపై లేవీయులకు సమావేశ గుడారాన్ని, దాని సేవకు ఉపయోగించే వస్తువులను మోసే పనిలేదు” అని చెప్పాడు.
27
దావీదు ఇచ్చిన చివరి ఆదేశాల ప్రకారం, లేవీయులలో ఇరవై సంవత్సరాలు అంతకు పైవయస్సు వారిని లెక్కించారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options