13
యెష్షయి కుమారులు: మొదటివాడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షిమ్యా,
14
నాలుగవవాడు నెతనేలు, అయిదవవాడు రద్దయి,
15
ఆరవవాడు ఓజెము, ఏడవవాడు దావీదు.
16
సెరూయా, అబీగయీలు వారి సహోదరీలు. సెరూయా కుమారులు ముగ్గురు: అబీషై, యోవాబు, అశాహేలు.
17
అబీగయీలు అమాశా తల్లి. ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశా తండ్రి.