1 దినవృత్తాంతములు 17:16-18
16
అప్పుడు రాజైన దావీదు లోపలికి వెళ్లి యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలా ప్రార్థించాడు: “దేవా యెహోవా, మీరు నన్ను ఈ స్థితిలోనికి తీసుకురావడానికి నేనెంతటివాన్ని? నా కుటుంబం ఏపాటిది?
17
ఇది మీ దృష్టికి చాలదన్నట్టు నా దేవా, మీ సేవకుని కుటుంబ భవిష్యత్తు గురించి కూడా తెలియజేశారు. దేవా యెహోవా, మీరు నన్ను మనుష్యుల్లో చాలా గొప్పవానిగా చూశారు.
18
“మీ సేవకుని ఘనపరుస్తున్నందుకు దావీదు మీతో ఇంకేం చెప్పగలడు? మీ సేవకుని గురించి మీకు తెలుసు.
Settings