1 దినవృత్తాంతములు 14:8-12
8
ఇశ్రాయేలు అంతటి మీద దావీదును రాజుగా అభిషేకించారని ఫిలిష్తీయులు విని, అతన్ని పట్టుకోవడానికి సైన్యమంతటితో బయలుదేరి వచ్చారు, అయితే దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కోడానికి వెళ్లాడు.
9
ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీము లోయలో దాడి చేశారు.
10
అప్పుడు దావీదు, “నేను వెళ్లి ఫిలిష్తీయుల మీద దాడి చేయాలా? మీరు నాకు వారిని అప్పగిస్తారా?” అని దేవుని అడిగాడు. అందుకు యెహోవా, “వెళ్లు, నేను వారిని నీ చేతికి అప్పగిస్తాను” అని అతనికి జవాబిచ్చారు.
11
కాబట్టి దావీదు తన మనుష్యులతో బయల్-పెరాజీముకు వెళ్లి వారిని ఓడించాడు. అతడు, “నీళ్లు కొట్టుకుపోయినట్లుగా దేవుడు నా శత్రువులను నా ఎదుట ఉండకుండ నా చేత నాశనం చేశారు” అని చెప్పి ఆ స్థలానికి బయల్-పెరాజీము అని పేరు పెట్టారు.
12
ఫిలిష్తీయులు తమ దేవతల విగ్రహాలను అక్కడే విడిచిపెట్టి పారిపోగా దావీదు వాటిని అగ్నిలో కాల్చివేయమని ఆజ్ఞాపించాడు.
Settings