Skip to content

కీర్తనలు93

1
యెహోవా పరిపాలిస్తున్నారు, ఆయన ప్రభావాన్ని వస్త్రంగా ధరించుకున్నారు; యెహోవా ప్రభావాన్ని వస్త్రంగా బలాన్ని ఆయుధంగా ధరించుకున్నారు; నిజానికి, ప్రపంచం దృఢంగా క్షేమంగా స్థాపించబడింది.
2
మీ సింహాసనం ఆది నుండి సుస్థిరమే. అనాది కాలం నుండి మీరున్నారు.
3
యెహోవా, నదులలో వరదలు లేచాయి, నదులు ఉరుములా గర్జిస్తున్నాయి, అలలు చెలరేగుతున్నాయి.
4
జలప్రవాహాల ఘోష కన్నా బలమైన సముద్ర తరంగాల కన్నా, యెహోవా బలాఢ్యుడై ఉన్నాడు.
5
యెహోవా, మీ శాసనాలు స్థిరమైనవి; యెహోవా మీ మందిరం అంతం లేనన్ని దినాలు పరిశుద్ధతతో అలంకరించబడుతుంది.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options