Skip to content
కీర్తనలు 145:14-20

దేవుడు విశ్వాసులను పోషించి వారి ప్రార్థనలు ఆలకించును

కీర్తనలు 145:14-20
14
యెహోవా పడిపోతున్న వారికి సహాయం చేస్తారు, అలిసిపోయిన వారిని లేవనెత్తుతారు.
15
అందరి కళ్లు మీ వైపు చూస్తాయి, సరియైన వేళలో మీరు వారికి ఆహారం ఇస్తారు.
16
మీరు మీ గుప్పిలి విప్పి జీవులన్నిటి కోరికలు తీరుస్తారు.
17
యెహోవా తన మార్గాలన్నిటిలో నీతిమంతుడు. ఆయన క్రియలన్నిటిలో నమ్మకమైనవాడు.
18
ఆయనకు మొరపెట్టు వారందరికి, నిజాయితీగా మొరపెట్టు వారందరికి యెహోవా సమీపంగా ఉంటారు.
19
ఆయనయందు భయము గలవారి కోరికలు తీరుస్తారు; వారి మొర విని వారిని రక్షిస్తారు.
20
యెహోవా తనను ప్రేమించే వారందరిని కాపాడతారు, కాని దుష్టులను ఆయన నాశనం చేస్తారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options