కీర్తనలు 131:3
చుట్టుపక్కల సందర్భంతో వచనం 3 చూపబడుతోంది.
1
దావీదు యాత్రకీర్తన. యెహోవా, నా హృదయం గర్వం కలిగిలేదు, నా కళ్లు అహంకారం కలిగిలేవు. నేను గ్రహించలేని గొప్ప విషయాలను నాకు అసాధ్యమైన విషయాలను నేను పట్టించుకోను.
2
పాలు విడచిన బిడ్డ సంతృప్తిగా ఉన్నట్లు, అవును, పాలు విడచిన బిడ్డ తన తల్లి ఒడిలో సంతృప్తిగా ఉన్నట్లు, నన్ను నేను నెమ్మదిపరచుకొని ప్రశాంతంగా ఉన్నాను.
3
ఓ ఇశ్రాయేలు, ఇప్పటినుండి నిరంతరం యెహోవా పైనే నీ నిరీక్షణ ఉంచు.
Settings