కీర్తనలు 104:7-15
7
మీ మందలింపుతో జలాలు పారిపోయాయి, మీ ఉరుముల ధ్వనికి పలాయనం చిత్తగించాయి;
8
అవి పర్వతాలకు మీదుగా వెళ్లాయి, అవి లోయల్లోకి దిగిపోయాయి, వాటికి మీరు నిర్ణయించిన చోటుకు అవి చేరుకున్నాయి.
9
అవి దాటలేని సరిహద్దును మీరు ఏర్పరిచారు; అవి ఎన్నటికి భూమిని ముంచివేయవు.
10
ఆయన ఊటలను కనుమలలోకి నీటిని కుమ్మరింపజేస్తారు; అవి పర్వతాల మధ్య ప్రవహిస్తున్నాయి.
11
అవి పొలాలలోని అడవి మృగాలకు నీరు అందిస్తాయి; అడవి గాడిదలు తమ దాహం తీర్చుకుంటాయి.
12
ఆ జలాల ప్రక్కన ఆకాశపక్షులు గూడు కట్టుకుంటాయి; కొమ్మల మధ్య అవి పాడతాయి.
13
తన ఆకాశ గదుల్లో నుండి ఆయన పర్వతాలను తడుపుతారు; ఆయన క్రియా ఫలం చేత భూమి తృప్తి చెందుతుంది.
14
ఆయన పశువుల కోసం గడ్డి పెరిగేలా చేస్తున్నారు, మనుష్యులు శ్రమించి సాగుచేయడానికి మొక్కలను మొలిపిస్తున్నారు, అలా భూమి నుండి ఆహారాన్ని పుట్టిస్తున్నారు:
15
మానవ హృదయాలకు సంతోషం కలిగించడానికి ద్రాక్షరసాన్ని, వారి ముఖాలను ప్రకాశించేలా చేయడానికి నూనెను, వారి హృదయాలను బలపరిచే ఆహారాన్ని ఇస్తున్నారు.
Settings