Перейти к содержимому
యెహెజ్కేలు 38:6

యెహెజ్కేలు 38:6

చుట్టుపక్కల సందర్భంతో వచనం 6 చూపబడుతోంది.
3
ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మెషెకుకు తుబాలుకు ముఖ్య అధిపతియైన గోగూ, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను.
4
నేను నిన్ను వెనక్కు త్రిప్పి, నీ దవడలకు కొక్కేలు తగిలించి, నిన్ను సైన్యమంతటితో పాటు, నీ గుర్రాలను, సంపూర్ణ సాయుధులైన నీ రౌతులను, పెద్ద చిన్న డాళ్లను ధరించి, వారంతా ఖడ్గాలు ఆడిస్తూ పట్టుకున్న యోధులను బయటకు తీసుకువస్తాను.
5
పర్షియా, కూషు, పూతు వారందరు డాళ్లు, శిరస్త్రాణాలు ధరించి వారితో పాటు వస్తారు.
6
అలాగే గోమెరు అతని సైన్యం, ఉత్తరాన దూరంగా ఉన్న తోగర్మా అతని సైన్యం, ఇంకా అనేక జాతులవారు నీతో వస్తారు.
7
“ ‘సిద్ధంగా ఉండు; నీవు నీతో పాటు చేరిన సమూహమంతటితో కలిసి సిద్ధంగా ఉండు, నీవే వారికి నాయకునిగా ఉండు.
8
చాలా రోజుల తర్వాత నీవు పిలువబడతావు. రాబోయే సంవత్సరాల్లో మీరు యుద్ధం నుండి కోలుకున్న దేశం మీద, చాలాకాలంగా నిర్జనంగా ఉన్న ఇశ్రాయేలు పర్వతాలమీద నివసించడానికి వివిధ దేశాల నుండి సమకూర్చబడి దాని ప్రజల మీద దాడి చేస్తారు. వారు చెదిరిపోయిన దేశాల నుండి సమకూర్చబడి ఇప్పుడు నిర్భయంగా జీవిస్తున్నారు.
9
అయితే నీవు గాలి తుఫాను వచ్చినట్లుగా వస్తావు; నీవు, నీ సైన్యం, నీ పక్షాన ఉన్న అనేకమంది ప్రజలు కలిసి దేశం మీద మేఘంలా కమ్ముకుంటారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options