Skip to content
యెహెజ్కేలు 32:1

యెహెజ్కేలు 32:1

చుట్టుపక్కల సందర్భంతో వచనం 1 చూపబడుతోంది.
1
పన్నెండవ సంవత్సరం, పన్నెండవ నెల మొదటి రోజున యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది:
2
“మనుష్యకుమారుడా, ఈజిప్టు రాజైన ఫరోను గురించి విలాప గీతం పాడి అతనితో ఇలా చెప్పు: “ ‘దేశాల మధ్య సింహంవంటివాడవు; నీవు నీ ప్రవాహంలో కొట్టుకుపోతూ, నీ పాదాలతో నీటిని చిమ్ముతూ, ప్రవాహాలను బురదమయం చేస్తూ, సముద్రాల్లో ఉండే భీకరమైన సముద్ర జీవిలాంటి వాడవు.
3
“ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘గుంపులు గుంపులుగా ప్రజలు చేరినప్పుడు నేను నీ మీద వల వేస్తాను; నా వలలో చిక్కిన నిన్ను వారంతా నీటిలో నుండి బయటకు లాగుతారు.
4
నేను నిన్ను నేల మీద పడవేసి బయట పొలంలో విసిరివేస్తాను. ఆకాశ పక్షులను నీ మీద వ్రాలనిస్తాను, అడవి జంతువులను వాటి కడుపునిండా నిన్ను తినేలా చేస్తాను.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options