యెహెజ్కేలు 20:12-24
12
యెహోవానైన నేనే వారిని పవిత్రపరచానని వారు తెలుసుకునేలా, నాకు వారికి మధ్య సూచనగా సబ్బాతులను నియమించాను.
13
“ ‘అరణ్యంలో ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి, నా శాసనాలను తృణీకరించి, వాటికి లోబడేవారు బ్రతుకుతారని నేనిచ్చిన నా ధర్మశాస్త్రాన్ని పాటించకుండా నేను నియమించిన సబ్బాతులను పూర్తిగా అపవిత్రం చేశారు. కాబట్టి వారిపై నా ఉగ్రత కుమ్మరించి వారిని అరణ్యంలో నాశనం చేయాలనుకున్నాను.
14
అయితే కోసం నేను ఎవరి దృష్టిలో వారిని బయటకు తీసుకువచ్చానో ఆ జాతుల దృష్టిలో నా నామం అపవిత్రం కాకుండా ఉండేందుకు నేను అనుకున్న ప్రకారం చేయలేదు.
15
తమకిష్టమైన విగ్రహాలను పూజించాలని నా ధర్మశాస్త్రాన్ని పాటించకుండ నా శాసనాలను అనుసరించకుండ నా సబ్బాతులను అపవిత్రం చేసినందుకు, నేను వారికి ఇస్తానని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, అన్ని దేశాల్లో అతి సుందరమైన దేశంలోనికి నేను వారిని తీసుకురానని వారు అరణ్యంలో ఉండగానే నా చేయి పైకెత్తి వారితో ప్రమాణం చేశాను.
17
అయినా వారి మీద జాలిపడి వారిని నాశనం చేయలేదు, అరణ్యంలోనే వారిని అంతం చేయలేదు.
18
వారు అరణ్యంలో ఉన్నప్పుడు నేను వారి పిల్లలతో, “మీ తండ్రుల కట్టడలను పాటించవద్దు; వారి పద్ధతులను అనుసరిస్తూ వారి విగ్రహాలను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు.
19
మీ దేవుడైన యెహోవాను నేనే; నా శాసనాలను అనుసరిస్తూ నా ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా పాటించండి.
20
సబ్బాతును పరిశుద్ధంగా పాటించండి; నేనే మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకునేలా అవి మీకూ నాకు మధ్య సూచనగా ఉంటాయి” అని చెప్పాను.
21
“ ‘అయినా వారి పిల్లలు నాపై తిరగబడ్డారు: వారు అనుసరించి బ్రతకాలని చెప్పి నేను ఇచ్చిన నా శాసనాలను వారు పాటించకుండా నా ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా నా సబ్బాతును అపవిత్రం చేశారు. కాబట్టి వారు అరణ్యంలో ఉండగానే నా ఉగ్రతను వారి మీద కుమ్మరించి కోపాన్ని తీర్చుకోవాలని అనుకున్నాను.
22
అయితే నేను ఏ ఇతర ప్రజలమధ్య ప్రత్యక్షమయ్యానో ఏ ఇతర ప్రజల నుండి వారిని బయటకు రప్పించానో ఆ ప్రజలమధ్య నా నామం అపవిత్రపరచబడకుండా నా చేయి వెనుకకు తీసి నా వాగ్దానం నెరవేర్చాను.
23
వారు నా ధర్మశాస్త్రానికి లోబడకుండా నా శాసనాలను తృణీకరించి నా సబ్బాతును అపవిత్రపరచి తమ తండ్రులు పెట్టిన విగ్రహాలను పూజించారు, కాబట్టి నేను వారిని ఇతర ప్రజలమధ్య చెదరగొట్టి అన్ని దేశాలకు వారిని చెదరగొడతానని అరణ్యంలో వారికి ప్రమాణం చేశాను.
Settings