Skip to content
నిర్గమకాండము 30:1-11

నిర్గమకాండము 30:1-11

1
“ధూపం వేయడానికి నీవు తుమ్మకర్రతో ఒక వేదిక తయారుచేయాలి.
2
అది చతురస్రంగా, ఒక మూర పొడవు ఒక మూర వెడల్పు రెండు మూరల ఎత్తు ఉండాలి. దాని కొమ్ములను దానితో ఒకే ఖండంగా ఉండేలా చేయాలి.
3
దాని పైభాగానికి, అన్ని ప్రక్కలకు, కొమ్ములకు స్వచ్ఛమైన బంగారు రేకుతో పొదిగించి దాని చుట్టూ బంగారు కడ్డీ చేయించాలి.
4
ఆ కడ్డీ క్రింద ఉన్న బలిపీఠాన్ని మోయడానికి ఉపయోగించే మోతకర్రలను పెట్టడానికి, ఒకదానికొకటి ఎదురుగా ఉండేలా రెండు బంగారు ఉంగరాలు తయారుచేయాలి.
5
తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటిని బంగారంతో పొదిగించాలి.
6
ధూపవేదికను నిబంధన మందసాన్ని కాపాడే తెర ముందు పెట్టాలి, ఒడంబడిక పలకల మీద ఉన్న ప్రాయశ్చిత్త మూత ఎదుట దాన్ని ఉంచాలి. అక్కడే నేను నిన్ను కలుసుకుంటాను.
7
“అహరోను ప్రతిరోజు ఉదయం దీపాలు పెట్టినప్పుడు బలిపీఠం మీద పరిమళ వాసనతో కూడిన ధూపం వేయాలి.
8
సాయంకాలం అహరోను దీపాలను వెలిగించేటప్పుడు దాని మీద మరలా ధూపం వేయాలి. రాబోయే తరాల వరకు యెహోవా ఎదుట నిత్యం ధూపం వేయాలి.
9
నీవు దాని మీద ఇతర ధూపాలను గాని దహనబలిని గాని భోజనార్పణ గాని అర్పించకూడదు, దాని మీద పానార్పణ పోయకూడదు.
10
సంవత్సరానికి ఒకసారి అహరోను దాని కొమ్ముల మీద ప్రాయశ్చిత్తం చేయాలి. ఈ వార్షిక ప్రాయశ్చిత్తం రాబోయే తరాల కోసం ప్రాయశ్చిత్త పాపపరిహారబలి రక్తంతో చేయాలి. అది యెహోవాకు అతిపరిశుద్ధమైనది.”
11
తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నారు:
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options