Skip to content
ప్రసంగి 12:12

జాగ్రత్తకు ఒక మాట

ప్రసంగి 12:12
చుట్టుపక్కల సందర్భంతో వచనం 12 చూపబడుతోంది.
9
ప్రసంగి జ్ఞాని మాత్రమే కాదు అతడు ప్రజలకు కూడా జ్ఞానాన్ని అందించాడు. అతడు లోతుగా ఆలోచించి ఎన్నో సామెతలను క్రమపరిచాడు.
10
ఈ ప్రసంగి సరియైన మాటలనే చెప్పాడు; అతడు సత్యమైన యథార్థ వాక్కులు వ్రాశాడు.
11
జ్ఞానుల మాటలు ములికోలు లాంటివి, సేకరించిన సూక్తులు గట్టిగా దిగగొట్టిన మేకుల వంటివి; అవి ఒక కాపరి చేత ఇవ్వబడ్డాయి.
12
నా కుమారుడా, వీటితో పాటు ఇతర వాటి గురించి జాగ్రత్తగా ఉండు. పుస్తకాల రచనకు అంతం లేదు, అధిక చదువు శరీరానికి అలసట కలిగిస్తుంది.
13
ఇవన్నీ విన్న తర్వాత, అన్నిటి ముగింపు ఇదే: దేవునికి భయపడాలి ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఇదే మనుష్యులందరి కర్తవ్యము.
14
దేవుడు ప్రతి పనిని తీర్పులోనికి తెస్తారు, దాచబడిన ప్రతి దానిని, అది మంచిదైనా చెడ్డదైనా సరే తీర్పులోనికి తెస్తారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options