Skip to content
ఆమోసు 6:1

ఆమోసు 6:1

చుట్టుపక్కల సందర్భంతో వచనం 1 చూపబడుతోంది.
1
సీయోనులో సంతృప్తిగా ఉన్నవారికి శ్రమ, సమరయ పర్వతం మీద ఆధారపడి ఉన్న మీకు శ్రమ, ఇశ్రాయేలు ప్రజలకు సలహాదారులుగా ఉన్న, గొప్ప దేశాల్లో ప్రముఖులైన మీకు శ్రమ!
2
మీరు కల్నేకు వెళ్లి చూడండి; అక్కడినుండి హమాతుకు వెళ్లండి, తర్వాత ఫిలిష్తీయలోని గాతుకు వెళ్లండి. మీ రెండు రాజ్యాల కంటే అవి గొప్పవా? వాటి నేల మీకంటే పెద్దది కాదా?
3
ఆపద్దినం దూరంగా ఉందనుకుని, దౌర్జన్య పరిపాలనను త్వరగా రప్పిస్తున్నారు.
4
మీరు దంతపు మంచాల మీద పడుకుంటారు, పరుపులపై ఆనుకుంటారు. శ్రేష్ఠమైన గొర్రెపిల్లలను, శాలలోని క్రొవ్విన దూడలను మీరు తింటారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options