Skip to content
అపొస్తలుల కార్యములు 7:44-50

అపొస్తలుల కార్యములు 7:44-50

44
“దేవుడు మోషేకు చూపించిన నమూనా ప్రకారం, దేవుని సన్నిధి కలిగిన సాక్షి గుడారం అరణ్యంలో మన పితరుల దగ్గర ఉన్నది.
45
ఆ గుడారాన్ని పొందుకొన్న తర్వాత, మన పితరులు యెహోషువ నాయకత్వంతో దేవుడు తమ ముందు నుండి వెళ్లగొట్టిన జనాలను నుండి స్వాధీనపరచుకున్న దేశంలోనికి తమతో పాటు దానిని తెచ్చారు. ఆ గుడారం దావీదు కాలం వరకు ఆ దేశంలోనే ఉన్నది.
46
దావీదు దేవుని దయను అనుభవించినవాడై, యాకోబు దేవుని కోసం నివాస స్థలాన్ని ఏర్పాటుచేస్తానని దేవున్ని అడిగాడు.
47
కానీ ఆయన కోసం నివాస స్థలాన్ని సొలొమోను కట్టించాడు.
48
“అయినా, మానవుల చేతులతో నిర్మించే ఆలయాలలో సర్వోన్నతుడు నివసించడు. దాని గురించి ప్రవక్తలు ఈ విధంగా చెప్పారు:
49
“ ‘ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా కోసం ఎలాంటి నివాస స్థలాన్ని కడతారు? అని దేవుడు అంటున్నారు నా విశ్రాంతి స్థలం ఏది?
50
వీటన్నిటిని చేసింది నా చేయి కాదా?’
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options